‘పేదల తిరుపతి’ పునర్నిర్మాణానికి..మే 8న సీఎం భూమిపూజ

‘పేదల తిరుపతి’ పునర్నిర్మాణానికి..మే 8న సీఎం భూమిపూజ

కొడంగల్, వెలుగు: వికారాబాద్ జిల్లా కొడంగల్​లోని ప్రసిద్ధ శ్రీమహాలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులను రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస్ రాజు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ నెల 8న ఆలయ పునర్నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ నిర్వహిస్తారని వెల్లడించారు. సుమారు రూ. 110 కోట్లు మంజూరు చేసి 4 ఎకరాల భూసేకరణను ప్రభుత్వం చేపట్టిందని, ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులకు ఇప్పటికే పరిహారం, ప్లాట్లు, ప్రత్యేక ప్యాకేజీ అందించినట్లు తెలిపారు.

ఆలయ చుట్టుపక్కల సేకరించిన స్థలంలోని నిర్మాణాలను వెంటనే తొలగించి, సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ‘పేదల తిరుపతి’గా పేరొందిన ఈ ఆలయ అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎండోమెంట్ కమిషనర్ హనుమంత్ రావు, కలెక్టర్ దీపక్ తీవారి, కడా స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.